అవినీతి, కఠిన వ్యవహార శైలి ఘటనలతో జిల్లా నూతన సీపీకి వినూత్నంగా స్వాగతం పలికిన బోధన్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా కొత్త పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే సీపీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే పోలీసుల అవినీతి, కఠిన వ్యవహార ఘటనలు వెలుగుచూడడంతో నూతన కమిషనర్ కు బోధన్ పోలీసులు ఇలా స్వాగతం తెలిపారా అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

రూరల్ పోలీస్ కానిస్టేబుల్ అవినీతి ఘటన :

సిపి బాధ్యతలు స్వీకరించే రోజు సోమవారం ఉదయం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక అవినీతి ఘటన బయటపడింది. శనివారం బోధన్ న్యాయస్థానంలో నిర్వహించిన లోక్ అదాలత్ లో అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తులపై స్థానిక న్యాయస్థానంలో కేసు విచారించడం జరిగింది. న్యాయమూర్తి ప్రతి బాధితుడికి రూ. 2000 జరిమానా విధించగా, కోర్ట్ కానిస్టేబుల్ మాత్రం వారికి రూ. 4000 డిమాండ్ చేసినట్లు ఒక బాధితుడు మీడియాకు వెల్లడించాడు.

బైక్ చోరీ కేసు అనుమనితుడితో కఠినంగా వ్యవహరించిన టౌన్ కానిస్టేబుల్ :

మంగళవారం సిపి బాధ్యతలు చేపట్టిన తరువాత మరొక వివాదం వెలుగుచూసింది. బైక్ చోరీ కేసులో అనుమనితుడిగా భావించి అరెస్టు చేసిన ఓ వ్యక్తిని బోధన్ టౌన్ కానిస్టేబుల్ కాళ్లకు సంకెళ్లు వేసి స్టేషన్లో వెట్టిచాకిరి చేయించే ఒక సంఘటన వీడియో సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు పోలీస్ శాఖపై మక్కువ తగ్గుతుంది.

ఈ రెండు ఘటనలతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. “సరైన బాధ్యతలు నిర్వహించగలిగే పోలీసులు ఎక్కడ?” అని వారు ప్రశ్నిస్తు, పోలీస్ ఉన్నత అధికారుల నుండి న్యాయం కోరుతూ, తప్పు చేసిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన నియమాలతో ఆదేశాలు జారీ చెయ్యాలని కోరుతున్నారు.

జిల్లా పోలీస్ శాఖలో మార్పు తీసుకురావాలి – సీపీ కి ప్రముఖుల విజ్ఞప్తి :

K

నిజామాబాద్ జిల్లా ప్రజలు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య నుండి మరింత సానుకూల మార్పు కోరుతున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఈ తరహా అవినీతి మరియు నిర్లక్ష్యాలు అదుపు చేయడానికి, ప్రజల కఠిన సమస్యలు తీర్చడానికి, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణి లాంటి కార్యక్రమాలను స్థానికంగా కూడా నిర్వహించి అర్జీదారుల సమస్యలను నేరుగా కమిషనర్ ముందు ఉంచే అవకాశాన్ని కల్పిస్తే, వారి సమస్యల గురించి మరియు కింది స్థాయి పోలీస్ అధికారుల తీరు, సిబ్బంది తీరుపై సరైన అవగాహన కూడా ఏర్పడుతుంది అని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య నూతన బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం అని, ప్రజల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు సమర్థంగా పనిచేస్తేనే పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది అని జిల్లా ప్రజలు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment