తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై హర్షం.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ టీపీసీసీ పిలుపు మేరకు చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

నీలం మధు మాట్లాడుతూ, జనాభా నిష్పత్తి మేరకు బీసీలకు రాజకీయ, ఉద్యోగ, విద్య, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన్ల పెంపు బిల్లు, అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని హర్షించామని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారని, ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందని ప్రశంసించారు.

ఈ రెండు బిల్లుల ఆమోదంతో తెలంగాణ రాజకీయ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి చెరగని ముద్రవేశారని రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment