|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, నీలా గ్రామంలో ఉన్న సైలానీ బాబా దర్గాలో ఈ రోజు హోలిక దహన్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. దర్గా ప్రధాన పూజారి వాహిద్ బాబా వెల్లడించిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 3 గంటలకు హోలిక దహన్ ప్రారంభమవుతుంది. తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా మార్చి 8న సందల్ దహన్‌తో పాటు ఖవ్వాలి కార్యక్రమం కూడా యథావిధిగా నిర్వహించబడుతుంది అని, నీలా గ్రామానికి చేరుకోవడానికి భక్తులు ధర్మాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగవచ్చు, అక్కడి నుంచి దర్గా సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజామాబాద్–బోధన్–నీలా మార్గంలో ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. హోలీ సందర్భంగా నరోల్ (స్వీట్లు) మరియు పాత దుస్తులను దానం చేయవచ్చు. ఈ దర్గాను దర్శిస్తే భక్తుల కష్టాలు తొలగిపోతాయని వాహిద్ బాబా తెలిపారు.








