బోధన్ గడ్డపై అధికారం ఎవరికీ? మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ సమరం – దృశ్యం న్యూస్ ఎగ్జిట్ పోల్స్.

|| దృశ్యం న్యూస్ ||

👉 బోధన్ గడ్డపై అధికారం కోసం రక్తికట్టిన రాజకీయ సమరం – మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ పరిస్థితి నెలకొనే వైనం?

👉 మ్యాజిక్ ఫిగర్ దాటేది ఎవరు? బోధన్‌లో ఉత్కంఠ తారాస్థాయికి కాంగ్రెస్‌కు మెజారిటీ కష్టమేనా? ఇతర కూటములే కీలకం అవుతాయా అనే చర్చ!

👉 ఎంఐఎం కింగ్‌మేకర్‌గా మారుతుందా? రాజకీయ వర్గాల్లో చర్చ – బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? బోధన్ ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది.

👉 భాజపా ప్రభావం ఎంత మేరకు ఉండనుంది? వార్డువారీ పోటీలో టఫ్ ఫైట్ – ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకునే అవకాశం.

👉 38 వార్డుల్లో హోరాహోరీ పోరు – తేలేది ఫలితాల రోజే – ఎక్స్-ఆఫీషియో, ఇతర సభ్యుల మద్దతు అవసరం అయినా? చైర్మన్ పీఠంపై ఎవరు ఉండబోతున్నారు.

👉 బోధన్ రాజకీయ సమీకరణాల మధ్య ఈరోజు ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్ బాక్స్ లో నుండి ఫలితాలు బయట పడే వరకు, ప్రజల అభిప్రాయం ఏమిటి అనేది వేచి చూడాలి.

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికలు ఈసారి తీవ్ర రాజకీయ ఉత్కంఠ నడుమ ముగిశాయి. మొత్తం 38 వార్డుల్లో జరిగిన ఈ పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగి పట్టణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడంతో బోధన్ రాజకీయ వాతావరణం గత కొన్ని వారాలుగా వేడెక్కింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తూ, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బలంగా రంగంలోకి దిగగా, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి ప్రచారాన్ని దూకుడుగా కొనసాగించి, ఎంఐఎం పార్టీ కూడా తమ కీలక నేతలతో ప్రచారం నిర్వహించి పట్టణంలో స్థానిక ప్రజలపై తమ పార్టీల ప్రభావం చూపే ప్రయత్నలు చేశారు.

ప్రచారం చివరి దశలో ప్రతి వార్డులో గట్టి పోటీ నెలకొంది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే అంశం స్థానికంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దృశ్యం న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం
కాంగ్రెస్ పార్టీ 16 నుంచి 18 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు అంచనా. అయితే మెజారిటీకి అవసరమైన 19 కి పై స్థానాలు దాటడం కష్టమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎంఐఎం 8 నుంచి 10 స్థానాలు,
బీఆర్ఎస్ 8 నుంచి 10 స్థానాలు,
భాజపా 4 నుంచి 6 స్థానాలు
సాధించే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. మరియు ఇతరులు 1 నుంచి 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోతే కూటముల రాజకీయాలు, లేదా స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడా కీలకమవుతాయని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే, ఎంఐఎం మద్దతుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకునే వ్యూహం అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో హంగ్ ఏర్పడే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కీలక పాత్ర పోషించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బోధన్ మున్సిపల్ కైవసం చేసుకోవాలంటే ఎక్స్-ఆఫీషియో మరియు ఇతర సభ్యుల మద్దతు కూడా ఫలితాలను ప్రభావితం చేసే అంశంగా మారే అవకాశం ఉంది.
బోధన్ గడ్డపై చివరికి ఏ పార్టీ జెండా ఎగురుతుందో ఫలితాల రోజే తేలనుంది. దృశ్యం న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బోధన్ మున్సిపల్ పాలనలో కూటముల సమీకరణాలు, ఇతరులు ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment