|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ ప్రావీణ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తాహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తొలి విడత ఎన్నికల ఏర్పాట్లు వేగంగా, పారదర్శకంగా పూర్తి కావాలని సూచిస్తూ ఓటర్ల జాబితా పరిశీలన, పోలింగ్ కేంద్రాల సిద్ధత, సిబ్బంది నియామకం వంటి అంశాలపై శాఖల వారీగా వివరాలు కోరారు. ఎన్నికలలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, స్వచ్ఛంగా జరగేందుకు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ తెలిపారు.








