హోవార్డ్ పాఠశాలలో ఎంతో సందడిగా బాలల దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ హోవార్డ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి చాచా జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు అందించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రత్న తేజ మాట్లాడుతూ, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు
సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, ఫుడ్ ఫెస్టివల్‌తో విద్యార్థులు మొత్తం రోజంతా ఉత్సాహంగా గడిపారు. పౌష్టికాహారం ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ ఆరోగ్యకరమైన వంటకాలను విద్యార్థులకు అందించారు. “నేటి బాలలే రేపటి పౌరులు. వారి అభివృద్ధి–భవిష్యత్ కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం” అని హోవార్డ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ టీఎస్ శశికళ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు అన్ని కార్యక్రమలలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ టీవీఆర్ మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొని పిల్లలలో ఆనందం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థులకు ఆనందాన్నిచ్చే మధుర జ్ఞాపకాలుగా నిలిచాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment