మెదక్ జిల్లా ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఫుట్‌బాల్ కిట్స్ పంపిణీ – అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నల్లగొండలో నవంబర్ 14 నుండి 16 వరకు జరగనున్న SGF రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనబోయే 17 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఫుట్‌బాల్ స్పోర్ట్స్ కిట్స్ ను అదనపు కలెక్టర్ నగేష్ గురువారం కలెక్టరేట్‌లో అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా” అని పేర్కొన్నారు. క్రీడాకారులకు కిట్స్ అందజేసిన ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ సర్వీసెస్ ఎం.డి హర్ష సేవా దృక్పథాన్ని అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఆటగాళ్లు మెరుగైన ప్రతిభ చూపి జిల్లాకు గౌరవం తెచ్చిపెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా విద్యాధికారి విజయ, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు, పీడీలు జి. మాధవరెడ్డి, జట్టు కోచ్ స్వాతి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment