మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ పర్యటన – రైతులకు సకాలంలో చెల్లింపులపై దృష్టి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సత్య సాయి రైస్ మిల్, వరిగుంతం ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు వడ్లు అమ్మిన తర్వాత ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు ఖాతాల్లో జమయ్యేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఇప్పటివరకు జిల్లాలో 82,481 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 21,277 మంది రైతుల ఖాతాల్లో రూ.54.52 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు.
అదేవిధంగా మిల్లర్లను ధాన్యం దిగుమతిలో వేగం పెంచాలని, ఏ లారీ 24 గంటలకు మించి వెయిటింగ్‌లో ఉండకూడదని, రైతు ధాన్యం కొనుగోలు తర్వాత వెంటనే తూకం చేసి ఆన్లైన్‌లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ధాన్యం నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగవర్ధన్‌, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment