లోక్ అదాలత్‌ – ప్రజలకు త్వరిత న్యాయం అందించే అద్భుత అవకాశం : జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు,

|| దృశ్యం న్యూస్ ||

మెదక్: లోక్ అదాలత్ ప్రజలకు త్వరగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించే విలువైన వేదిక అని. ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచిస్తూ, లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, వైవాహిక & కుటుంబ సమస్యలు, చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, డ్రంక్ అండ్ డ్రైవ్, విద్యుత్ చౌర్యం వంటి కేసులు పరిష్కారానికి వస్తాయని తెలిపారు.

అదేవిధంగా చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకుండా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని, జిల్లా పోలీసు అధికారులు, ఎస్ఎచ్ఓలు, కానిస్టేబుల్‌లు రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల మధ్య కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment