అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వార్షిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ముందుగా మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన ఎస్పీ, అనంతరం సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్ బాక్స్‌లను తనిఖీ చేసి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచిస్తూ పరిశుభ్రతలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కానిస్టేబుల్ జితేందర్‌కు రివార్డ్ మంజూరు చేశారు.

అనంతరం స్టేషన్ రికార్డులు, బ్యారక్స్, కేసు రికార్డులను పరిశీలించి, నాణ్యమైన దర్యాప్తు జరపాలని ఎస్‌.హెచ్‌.ఓ. శంకర్‌కు ఆదేశించారు. అలాగే కేడి సస్పెక్ట్ రౌడీలను తరచూ చెక్ చేయాలని, హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నిఘా బలోపేతం చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహణపై దృష్టి పెట్టాలని తెలిపారు.
వాహనాల తనిఖీ, డయల్-100 స్పందన, బ్లూ కోల్ట్స్ పర్యవేక్షణతో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సూచించిన ఎస్పీ, సిబ్బంది ఆధునిక సాంకేతికతను (CCTNS–2.0, TS-COP, CEIR, iRAD) సమర్థవంతంగా వినియోగించాలని చెప్పారు.U

Join WhatsApp

Join Now

Leave a Comment