|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నవంబర్ 3న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐ ఎం.కళ్యాణి సిబ్బంది సునీల్, నాగరాజ్, మిద్దెల రాజుతో కలిసి విద్యార్థినులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు మరియు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎం.కళ్యాణి మాట్లాడుతూ విద్యార్థినులు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫోటోలు (DPలు) ఉంచరాదని, గుర్తు తెలియని లింకులు లేదా APK ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని సూచించారు. ఎటువంటి లీగల్ సమస్యలు ఎదురైనప్పుడు పోలీసుల సహాయం తీసుకోవాలని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
స్కూల్ కరస్పాండెంట్ సుమలత, విజయ, శోభ టీచర్లు పాల్గొన్నారు. పోలీసులు విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గౌరవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.








