రాష్ట్రానికి ఆభరణంగా నిలిచే నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ – పర్యాటకులకు కొత్త ఆకర్షణ.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అర్బన్ ఎకో పార్క్ ను దేవాదాయ ధర్మాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ప్రారంభించారు. తెలంగాణలో అరుదైన ఈ ఎకో పార్క్ పర్యావరణ పరిరక్షణకు మరియు పర్యాటకాభివృద్ధికి కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఆమె అన్నారు. యువతలో ప్రకృతి ప్రేమను పెంపొందించే ఈ పార్క్‌లో అరుదైన మొక్కలు, లగ్జరీ కాటేజీలు, పిక్నిక్ స్పాట్స్, ఈవెంట్ వేదికలు, పచ్చదనం వంటి ఆకర్షణలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ఎకో పార్క్ చెరువును డంపింగ్ యార్డ్‌గా మార్చవద్దని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పార్క్ నర్సాపూర్ కు ప్రత్యేక గుర్తింపునిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ హమ్మద్ నదీమ్, అటవీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment