బోధన్ రురల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ – 25,000 రూపాయల నగదు బహుమతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, బోధన్ రూరల్ పరిధిలోని యువతకు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల యువకుల కోసం ఈ టోర్నమెంట్‌ను బోధన్ రూరల్ పోలీసులు నిర్వహిస్తున్నారు.

మొదటి స్థానం సాధించిన జట్టుకు ₹25,000 నగదు బహుమతి, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు ₹11,116 నగదు బహుమతి ప్రకటించారు. ఈ పోటీలు జానకంపేట్ గ్రామంలోని CTC గ్రౌండ్‌లో నిర్వహించబడనున్నాయి.

పాల్గొనదలచిన జట్లు నవంబర్ 2వ తేదీ సాయంత్రం వరకు బోధన్, ఎడపల్లి, రెంజల్ పోలీస్ స్టేషన్‌లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నవంబర్ 3న బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో డ్రా నిర్వహించబడుతుంది. టోర్నమెంట్ నవంబర్ 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.
ఈ క్రీడా కార్యక్రమం ద్వారా యువతలో ఐక్యత, క్రమశిక్షణ, క్రీడా మనోభావాలను పెంపొందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment