జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా మెదక్‌లో “రన్ ఫర్ యూనిటీ” ఘనంగా నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ పట్టణంలో అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఉదయం నిర్వహించిన 2K రన్‌లో స్థానిక యువత, విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 300 మంది పాల్గొన్న ఈ రన్‌ను అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగు బోధన్ చౌరస్తా నుండి ప్రారంభమై రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల ధన-మాన-ప్రాణ రక్షణకు పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, యువత, అధికారులు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, మహేష్, రాజశేఖర్ రెడ్డి, జార్జ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment