|| దృశ్యం న్యూస్ ||
మెదక్ అభివృద్ధి ఆరోగ్య పారిశుధ్యంపై ఆధారపడి ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. చెత్త సేకరణ మరియు వేర్పాటుకు ఆధునాతన పరికరాలను వినియోగించేందుకు ప్రభుత్వం రూ. 1,68,87,000 నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు.
గతంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉన్న చెత్త సేకరణను ఇప్పుడు సాంకేతిక పద్ధతులతో నిర్వహించనున్నామని, పట్టణం పరిశుభ్రంగా ఉండడం ద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడగలమని, ఈ ప్రాజెక్టు పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు.
అదేవిధంగా రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెత్త సేకరణ, వేర్పాటు, డ్రైనేజీ పునరుద్ధరణ వంటి కార్యక్రమాల్లో ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా మెదక్ ను పరిశుభ్ర నగరంగా అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు.








