పోలీస్ అమరుడి కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ మహేందర్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పాపన్నపేట పోలీస్ స్టేషన్ బాంబ్ బ్లాస్ట్‌లో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ఎం.డి. అబేద్ హుసేన్ (PC 330) కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు.

1999లో అసాంఘిక శక్తులు జరిపిన బాంబ్ దాడిలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఐదుగురు పోలీసు సిబ్బందిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్ అబేద్ హుసేన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఆ ఘటనలో అమరులైన హెడ్ కానిస్టేబుల్ ఎస్. రఘునందన్, కానిస్టేబుళ్లు ఎం.డి. అబేద్ హుసేన్, డి. రామచందర్, ఎన్. ప్రసాద్, టి. నర్సింహులు వీర త్యాగాలను గుర్తుచేశారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరుల సేవలు పోలీసు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment