చేగుంటలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం.

|| దృశ్యం న్యూస్ ||

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ మాట్లాడుతూ, పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండాలని చెప్పారు. రక్తదానం ఒక మహత్తర సేవగా పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను రక్షించే భాగస్వాములు అవుతారని అన్నారు.

రక్తదాన కార్యక్రమంలో చేగుంట పోలీస్ సిబ్బంది, స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేసి అదనపు ఎస్పీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, తూప్రాన్ సీఐ రంగ కృష్ణ, ఎస్‌ఐలు చైతన్య రెడ్డి, శంకర్, సుభాష్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment