|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో సోమవారం బోధన్ రోడ్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపుకు లక్కీ డ్రా నిర్వహించారు. మొత్తం 49 వైన్ షాపుల కోసం 1420 దరఖాస్తులు అందగా, కలెక్టర్ సమక్షంలో టోకెన్ల ద్వారా పారదర్శకంగా లాటరీ తీసి కేటాయింపులు జరిపారు. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మొత్తం ప్రక్రియను ఫోటో, వీడియో రికార్డింగ్‌తో పర్యవేక్షించారు.

జిల్లాలోని 49 షాపుల్లో ఎస్టీ – 1, ఎస్సీ – 6, గౌడ కులానికి 9 కేటాయించి మొత్తం 16 రిజర్వ్ షాపులు, మిగతా 33 అన్‌రిజర్వ్‌గా కేటాయించారు. లాటరీలో 18 మహిళలు అదృష్టం సాధించగా, 31 పురుషులు షాపులు పొందారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో ప్రశాంత వాతావరణంలో లక్కీ డ్రా పూర్తయింది. విజయదారులు డిసెంబర్ 1 నుంచి లైసెన్స్ ఫీజు చెల్లించి షాపులు ప్రారంభించనున్నారు.








