|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా నూతన టాస్క్ ఫోర్స్ సీఐగా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ ఎస్. మహేందర్‌లను పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.
గతంలో టాస్క్ ఫోర్స్ సీఐగా విధులు నిర్వహించిన కృష్ణమూర్తి DCRB కి బదిలీ కాగా, DCRB ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డి, జిల్లా శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. మెదక్ టాస్క్ ఫోర్స్ విభాగం నూతన ఇన్స్పెక్టర్ బాధ్యతల స్వీకరణతో జిల్లా పోలీస్ శాఖలో కొత్త ఉత్సాహం నెలకొంది.








