|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ప్రసిద్ధ జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ తన బంధుమిత్రులతో కలిసి స్వామివారిని దర్శించారు. కార్తీక మాసం మొదటి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బంధు మిత్రులతో కలసి ఆలయ పరిసరాలను పరిశీలించిన సాయిశివ ఈ దేవాలయం అత్యంత పురాతన చారిత్రక క్షేత్రంగా, భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచిందని, ఆలయం ప్రకృతి సౌందర్యంతో నిండిన పవిత్ర ప్రదేశమని, ఇక్కడ స్వామివారి దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందని, ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల సమయంలో వేలాది భక్తులు ఈ దేవాలయానికి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంటారని వారితో పేర్కొన్నారు.








