|| దృశ్యం న్యూస్ ||
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నాగేష్ సహా సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో పంచాయతీ, ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, వ్యవసాయం, పారిశ్రామికం, మున్సిపాలిటీ, విద్యుత్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రావు సూచించినట్లు, నియోజకవర్గంలోని పెండింగ్ పనులను తక్షణం పూర్తి చేయాలని, మెదక్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని అన్నారు. కొత్త పిహెచ్సీ సబ్ సెంటర్లు, రామాయంపేట హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, కొత్తపల్లి-శంకరంపేట్ రోడ్, దూప్ సింగ్ తండా-ఏడుపాయల రోడ్లు, పాపన్నపేట్-కొత్తపల్లి కాలువల మరమ్మతులు మొదలైన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నడిపించి రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని, గ్రామాల్లో పరిశుభ్రత, వీధి దీపాలు, కాలుష్య నివారణ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకే చేరేలా చూసి, పాత పనులను త్వరగా పూర్తిచేయమని సూచించారు.








