|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల, భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ సర్వేలో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. పాఠశాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మరియు పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల కోసం ఈ రేటింగ్ ఇవ్వబడింది.
125 మార్కుల మూల్యాంకనలో 114 మార్కులు సాధించి, ధర్పల్లి పాఠశాల జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది.
కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విజయానికి పాఠశాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు అందించిన సహకారం ముఖ్యమైనదని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలలో మొక్కలు నాటడం, సురక్షిత త్రాగునీటి వసతి, చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి వసతులు, ప్రకృతి వనరుల పునర్వినియోగం వంటి చర్యలు స్వచ్ఛతలో ప్రధాన భూమిక పోషించాయి. ఈ విజయం ద్వారా ధర్పల్లి ఆదర్శ పాఠశాల రాష్ట్రంలో ఉత్తమ విద్యా సంస్థగా గుర్తింపు పొందింది.








