|| దృశ్యం న్యూస్ ||
పోలీస్ అమరవీరుల త్యాగం వెళకట్టలేనివి అని, వారి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి అన్నారు. అక్టోబర్ 21న జరుపుకునే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ డే వారోత్సవాల భాగంగా అల్లాదుర్గ్ సర్కిల్ పరిధిలోని పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని సీఐ ప్రారంభించి ర్యాలీలో భాగంగా సీఐ రేణుక రెడ్డి స్వయంగా సైకిల్ నడుపుతూ పోలీస్ సిబ్బందికి ఉత్సాహాన్ని కలిగించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల త్యాగం అపూర్వమని, దేశవ్యాప్తంగా ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సేవలో మరింత కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, పోచయ్య, రాజేష్, మండల యువత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








