|| దృశ్యం న్యూస్ ||
బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్‌ను పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొండలవాడి శంకర్ కలిసి బోధన్ నుండి బడాపహాడ్ మీదుగా గాంధారి వరకు బస్సు సర్వీస్ మరియు నైట్ హల్ట్ బస్సును పునఃప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.
వర్ని మండలంలోని బడాపహాడ్ దర్గాకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు వస్తుంటారని తెలిపారు. కరోనా కాలం నుండి బస్సు సర్వీస్ నిలిపివేయడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. గాంధారి వరకు బస్సు నడపడం వలన వర్ని ప్రాంత ప్రజలకు కామారెడ్డి వైపు ప్రయాణం సులభమవుతుందని సూచించారు.
డిపో మేనేజర్ విశ్వనాథ్ సానుకూలంగా స్పందించి త్వరలో సర్వే నిర్వహించి బస్సు సౌకర్యం పునఃప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాములు తదితరులు పాల్గొన్నారు.








