జూబ్లీహిల్స్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి – మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపుతో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం గోపీనాథ్ చేసిన సేవలను గుర్తు చేశారు.
పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ – “2023లో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉప ఎన్నికల్లో మళ్లీ వంచనకు దిగుతోంది. జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండి, అభివృద్ధి మార్గం చూపగల బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలి” అని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకుల “ఆరు గ్యారంటీలు” కేవలం బాకీ కార్డులుగా మారాయని విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు చేరాలంటే సునీతా గోపీనాథ్ గెలుపే మార్గమన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment