|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజలకు జాగ్రత్త సూచనలు చేశారు. దీపావళి సందర్భంగా “స్పెషల్ ఆఫర్లు”, “లాటరీలు”, “గిఫ్ట్ కూపన్లు” పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు, లింక్‌లు పంపి మోసం చేస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్, SMSల ద్వారా పంపే ఈ లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదిక ప్రకారం అక్టోబర్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా 390 మంది బాధితులు రూ.8.5 లక్షలు కోల్పోయారు. ప్రజలు అధికారిక వెబ్సైట్లు లేదా యాప్‌ల ద్వారా మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేయాలని, అనుమానాస్పద లింక్‌లు, APK ఫైల్లు క్లిక్ చేయకూడదని సూచించారు. కస్టమర్ కేర్ నంబర్లు కూడా అధికారిక సైట్లలో ఉన్నవే వాడాలని సూచించారు. ముందస్తు చెల్లింపులు చేయకుండా “Cash on Delivery (CoD)” విధానాన్ని ఎంచుకోవాలి. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.








