|| దృశ్యం న్యూస్ ||
దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బాణాసంచా (టపాకాయలు) విక్రయాలపై జిల్లా పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా పోలీస్ అధికారి డీ.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు ముందుగా సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (DSP) కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందడం తప్పనిసరి అని,
ఎటువంటి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసిన వారి పట్ల Explosives Act–1884 మరియు Rules–1933 (Amendment 2008) ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసేటప్పుడు వ్యాపారులు పాటించవలసిన ముఖ్యమైన నిబంధనలు కూడా ఎస్పీ వివరించారు:
🔹 టపాకాయల షాపులు ఖాళీ ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేయాలి.
🔹 సంబంధిత ప్రదేశానికి NOC సర్టిఫికేట్ తప్పనిసరి.
🔹 ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదు.
🔹 జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, కళ్యాణ మండపాలు, సమావేశ భవనాలలో షాపులు ఏర్పాటు చేయరాదు.
🔹 షాపుల్లో అగ్నిభద్రతా పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
🔹 అన్ని వివరాలతో కూడిన దరఖాస్తు సంబంధిత DSP కార్యాలయానికి సమర్పించాలి.
మెదక్ జిల్లా పోలీస్ విభాగం ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాణాసంచా వ్యాపారులు మరియు ప్రజలు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.








