మెదక్: మహిళా ప్రాణాలను కాపాడిన డయల్ 100 కాల్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని నిన్సంపల్లి గ్రామంలో జరిగిన ఘటనలో, డయల్ 100 సిబ్బంది వేగవంతమైన స్పందనతో ఒక మహిళ ప్రాణాలను రక్షించారు. జ్యోతి అనే మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందనే సమాచారం అందగానే, పోలీసులు వరప్రసాద్ (లడ్డు), జైయానంద్, రమేష్ ఐదునిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
హోంగార్డు వరప్రసాద్ ఇంటి తలుపు పగులగొట్టి తక్షణ CPR చేసి, మహిళను అపస్మారక స్థితిలో నుంచి బయటకు తేవడంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం జ్యోతిని మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎస్ఐ నరేష్ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ అత్యవసర స్పందనతో మహిళ ప్రాణాలు కాపాడినందుకు ఎస్పీ, వరప్రసాద్ (లడ్డు), జైయానంద్, రమేష్‌లను ప్రశంసించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment