ఏటీసీ శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల భవిష్యత్తు మరింత వెలుగులు చూడనుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టర్ ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్‌తో కలిసి ఏటీసీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్‌లోని ఆధునిక సదుపాయాలు, శిక్షణా విధానం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి,
కలెక్టర్ రాహుల్ రాజ్ పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచిస్తూ, విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఏటీసీ లోని అధునాతన మిషనరీలు, ప్రాక్టికల్ ట్రైనింగ్ విధానం విద్యార్థుల కెరీర్ ఎదుగుదలలో కీలకమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్శనలో ఏటీసీ సెంటర్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment