విద్యార్థికి టిసి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? – ఎస్టి విద్యార్థిపై ప్రిన్సిపాల్ చర్యపై బంజారా సంఘాల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్టి విద్యార్థి రామావత్ చరణ్ బతుకమ్మ సంబరాల కోసం స్కూల్లో ఫోన్ తీసుకెళ్లాడనే కారణంగా ప్రిన్సిపాల్ విద్యార్థికి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టిసి) ఇచ్చినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఈ అంశంపై విద్యార్థికి టిసి ఇవ్వడం ఎంతవరకు న్యాయం అన్న సందేహంతో స్థానిక బంజారా సంఘాలు ప్రిన్సిపాల్ శశికళను వారు ప్రశ్నించగా, ప్రిన్సిపాల్ అనవసరంగా దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. చరణ్ ఎలాంటి తీవ్రమైన తప్పు చేయకపోయినా, కేవలం బతుకమ్మ వేడుకల సందర్భంగా ఫోన్ తీసుకెళ్లినందుకు టిసి ఇవ్వడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

బంజారా సంఘాల నాయకులు బాదావత్ శంకర్ నాయక్ (ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు), మాజీ సర్పంచ్ శర్మన్ నాయక్, కారోబార్ బాద్య, రమేష్, ఆన్సర్, రామావత్ గోపి తదితరులు స్పందిస్తూ – “ఎస్టి విద్యార్థి అని చులకనచేసి ఈ విధంగా వ్యవహరించడం కక్షసాధింపు చర్యగా భావించాలి. ఇది విద్యారంగంలో సమానత్వాన్ని దెబ్బతీసే చర్య” అని అన్నారు.
వారు తక్షణమే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా బంజారులతో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సంఘటనపై మాండలిక విద్యా అధికారి (ఎంఈఓ)కి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment