జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు పూర్తి సిద్ధతతో వ్యవహరించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మెదక్ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో ఈ రోజు నుండి జరగనున్న నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ దశలలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఆర్వో, ఏఆర్ఓలకు శిక్షణ పూర్తయిందని, పునఃశిక్షణ కూడా ఇచ్చినట్లు వివరించారు.

ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌టీ బృందాలు విధుల్లో ఉన్నాయని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిపోర్టులు నిరంతరం పంపుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment