గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల జీతాలు తక్షణం విడుదల చేయాలి – యూఎస్ఎఫ్ఐ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్ల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు. సమ్మె నిర్వహిస్తున్న వర్కర్లకు యూఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలుపుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీతాలు రాకపోవడంతో విద్యార్థులు హాస్టల్ వంటగదుల్లో పనులు చేసుకుంటున్నారని, వార్డెన్లు పరిస్థితిని పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో డైలీ వేజ్ మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది నాలుగు నెలలుగా వేతనాలు పొందలేదని తెలిపారు. వేతనాలు లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే “బెస్ట్ అవైలబుల్ స్కీమ్” కింద ఉన్న పాఠశాలలకు రెండు సంవత్సరాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో దళిత, గిరిజన విద్యార్థుల చదువు ప్రమాదంలో పడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని జగన్ తీవ్రంగా విమర్శిస్తూ పెండింగ్ జీతాలు, బిల్లులు, బకాయిలను తక్షణం విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment