|| దృశ్యం న్యూస్ ||
ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూములు మరియు ఓట్ల లెక్కింపు కేంద్రాలను సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్ట్రాంగ్ రూముల భద్రత, సీసీ కెమెరా పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం వంటి అంశాలను వివరంగా పరిశీలించారు. లెక్కింపు కేంద్రాల్లో విద్యుత్, లైటింగ్, భద్రతా సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల అధికారులందరూ అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలపై ధృవీకరణ నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవి, ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.








