|| దృశ్యం న్యూస్ ||
మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత విధానాలతో విసిగిపోయిన 30 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరికలు జరిగాయి.

ఈ చేరికల్లో మాజీ పిఏసీఎస్ డైరెక్టర్ తాడేపు మహిపాల్, నిరుడి సత్యం, సాయిబాబా అడ్వకేట్, గొల్ల శ్రీనివాస్, గాలి మల్లేష్, మేకల మల్లయ్య, పి.కిషన్, గణపతి, వెంకటేష్ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ – రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెదక్ జిల్లా జడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వంచనగా మారాయని, 22 నెలల పాలనలో ప్రజలంతా మోసపోయారని, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల గ్రామపంచాయతీలు నిధుల్లేక అస్తవ్యస్తంగా మారాయని, పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీష్ రావు పిలుపునిచ్చుతూ – “ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ విజయాన్ని సాధించాలి” అని తెలిపారు.








