|| దృశ్యం న్యూస్ ||
విజయదశమి పర్వదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, దసరా పండుగ తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందని, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని గుర్తు చేశారు.
ఈ పండుగ తెలంగాణలోని అన్ని వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. శమి పూజ, జమ్మి ఆకును బంగారంగా పంచుకోవడం, అలాయ్ బలాయ్ సంప్రదాయాలు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, పాలపిట్ట దర్శనం వంటి ఆచారాలు తెలంగాణకు ప్రత్యేకతను తీసుకొస్తాయని ఎమ్మెల్యే వివరించారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, సోదరభావంతో ఈ పండుగ జరుపుకోవాలని కోరుతూ, దుర్గామాత ఆశీస్సులు మెదక్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అప్రతిహత విజయాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.








