|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పేరూరు–ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మెదక్ ఆర్‌డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు బ్రిడ్జిని శనివారం సందర్శించారు. భద్రతా కారణాల రీత్యా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రజల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి ప్రయాణికులకు సూచించారు. స్థానికులకు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల తీవ్రత తగ్గే వరకు ఈ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరద నీటి స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.








