|| దృశ్యం న్యూస్ ||
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూడటంలో ప్రొసైడింగ్ అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, సైన్స్ అధికారి రాజిరెడ్డి సమక్షంలో ప్రొసైడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల వినియోగం, ఎన్నికల నిర్వహణపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
మెదక్ జిల్లాలోని 492 గ్రామపంచాయతీలలో 4220 వార్డులకు, 1052 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయని కలెక్టర్ తెలిపారు. 2549 మంది ప్రొసైడింగ్ అధికారులకు ఐదు శిక్షణా కేంద్రాలలో శిక్షణ ఇచ్చి, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి సకాలంలో సిద్ధం చేయాలని సూచించారు.
ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా జరగాలని, గత అనుభవాల దృష్ట్యా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.








