తెలంగాణ నూతన మద్యం పాలసీ 2025-27: మెదక్ జిల్లాలో 49 మద్యం షాపుల రిజర్వేషన్ డ్రా.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ (2025-27)లో భాగంగా జిల్లాలో మొత్తం 49 మద్యం షాపుల నిర్వహణకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. గురువారం కలెక్టర్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు పారదర్శకంగా డ్రా నిర్వహించారు.

వీడియోగ్రఫీ సమక్షంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల అధికారులు పాల్గొని రిజర్వేషన్ కేటాయింపును పర్యవేక్షించారు. మొత్తం 49 మద్యం షాపుల్లో బీసీ గౌడ వర్గానికి 9, ఎస్సీ వర్గానికి 6, ఎస్టీ వర్గానికి 1 షాపులు లాటరీ ద్వారా కేటాయించబడ్డాయి. మిగతా 33 షాపులు ఓపెన్ క్యాటగిరీ కింద కొనసాగనున్నాయి.

డ్రా ఫలితాలను రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఆమోదానికి పంపిస్తామని, పూర్తి గెజిట్ త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాసరావు, ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, ఎస్టీ అభివృద్ధి అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment