|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని శుభోదయం (NHC) సెంటర్ లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనసిక దివ్యాంగుల తల్లిదండ్రుల సమావేశం కూడా జరిగింది. ప్రొఫెషనల్ రేణుక, స్పెషల్ ఎడ్యుకేటర్ రాధిక, స్పీచ్ థెరపిస్ట్ CC బుచ్చన్న తల్లిదండ్రులకు పిల్లల మాటల థెరపీ, వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమాలు గురించి విలువైన సూచనలు అందించారు.

బతుకమ్మ పండుగ సాంప్రదాయాన్ని దివ్యాంగ పిల్లలకు అర్థమయ్యేలా వారితో కలిసి పాటలు, ఆటలు నిర్వహించడం ద్వారా వారికి ఆనందాన్ని పంచారు. సెంటర్ కార్యకర్త నర్సవ్వ, CBR స్వప్న కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పిల్లల సామాజిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వారికి చేరవేయడం ముఖ్య లక్ష్యంగా కొనసాగింది,శుభోదయం (NHC) సెంటర్ తరపున భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.








