నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా శ్రీనగర్ కాలనీ 45వ డివిజన్‌లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యం అని, ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక కృషి చేస్తున్నానని తెలిపారు.

బాలహనుమాన్ మందిరం పక్కన ఉన్న అండర్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరి వాహనదారులకు ఇబ్బందిగా మారుతోందని, దాన్ని తక్షణమే మరమ్మతు చేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్యలు లేకుండా మున్సిపల్ సిబ్బంది పూడికలు తీయాలని, అవసరమైతే కొత్త డ్రైనేజీ కాలువలు నిర్మించాలని కమిషనర్‌కు సూచించారు.

నిజామాబాద్ కార్పొరేషన్ పారిశుధ్యంలో రాష్ట్రంలో ముందంజలో నిలవాలంటే అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. వీధి ద్వీపాలు ఏర్పాటు, బీటీ & సీసీ రోడ్లు, పార్కులు, ఓపెన్ జిమ్‌లు, కల్వర్టులు వంటి అభివృద్ధి పనులకు వంద కోట్ల ఫండ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

రాత్రిపూట ఆకాతాయిలు సృష్టిస్తున్న సమస్యపై పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని ఏసీపీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ AE పావని, బీజేపీ నేతలు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment