మెదక్: యూరియా అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడి – 250 సంచులు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా యూరియాను రవాణా చేస్తున్న డీసీఎం వాహనం పట్టుబడింది. వాహనంలో మొత్తం 250 యూరియా సంచులు స్వాధీనం చేసుకుని, టేక్మాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ – “రైతుల కోసం ప్రభుత్వం అందజేస్తున్న యూరియాను కొంతమంది అక్రమార్కులు నిల్వచేసి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఒక్కవైపు పంటలు దెబ్బతింటాయని రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అక్రమంగా లాభాలు పొందే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

అలాగే, రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా యూరియాను నిల్వచేసే వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా పోలీసులు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment