మెదక్: రాజీ మార్గమే రాజమార్గం – 13న జాతీయ మెగా లోక్ అదాలత్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోకుండా రాజీ మార్గం ద్వారా ఇరువురూ లాభపడతారని ఎస్పీ స్పష్టం చేశారు.

లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, వైవాహిక సమస్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ, చెక్ బౌన్స్ కేసులు వేగంగా పరిష్కారం కానున్నాయని తెలిపారు.

అలాగే SHOలు, కోర్టు కానిస్టేబుళ్లు కౌన్సెలింగ్ నిర్వహించి ఇరువర్గాల మధ్య అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీని ద్వారా తక్కువ సమయంలో న్యాయం లభించి సమాజంలో శాంతి, సహకారం పెరుగుతుందని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందుబాటులోకి వస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment