|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రుద్రుర్ మండలంలో 1990-1991 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి స్నేహితులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. వాణి సాహితి స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 15 నుండి 30 సంవత్సరాలుగా అంకితభావంతో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న 10 మంది ఉపాధ్యాయులకు సన్మానం లభించింది.
ఈ సందర్భంగా సన్మానం పొందిన వారిలో సునీత జలోజి, సునీత హన్మండ్లు, సరస్వతీ నాగరాజ్, లోగం నాగరాజ్, కర్రోల్ల కృష్ణ ప్రసాద్, వాసవి, సాయిలీలా విజయ్, మహాజన్ భవాని, మహాజన్ నర్సింలు, గాయత్రి గజేందర్ ఉన్నారు.
తమ బాల్య స్నేహితులు ఉపాధ్యాయ వృత్తిలో నిలదొక్కుకోవడం పట్ల పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన 1990-1991 SSC బ్యాచ్ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








