|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టుముక్కల గ్రామంలో రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాషా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది.
రైతులు వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే అధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం ఈ పంటకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 2023-24లో 336 ఎకరాల్లో సాగు జరిగిన ఈ పంట, 2024-25లో 533 ఎకరాలకు విస్తరించింది. 2025-26లో 2500 ఎకరాల లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు.

ఆయిల్ పామ్ మొక్కలు నాటిన నాలుగేళ్లకు ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి వస్తుందని, ప్రస్తుతం ఒక్క టన్నుకు రూ.19,108 ధర లభిస్తుందని అధికారులు వివరించారు. రైతులకు మొక్కల సబ్సిడీతో పాటు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై 12.50 ఎకరాల వరకు రాయితీ సదుపాయం ఉంది.
ప్రతి 15 కి.మీ.లకు కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం, రైతుల ఖాతాలో 14 రోజుల్లో చెల్లింపులు జమ చేయడం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో కోకో వంటి పంటలతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని సూచించారు.








