|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా దాదిగూడెం మత్స్యకారులకు ఘన విజయం సాధించారు, సమర్థంగా నడిపించిన పోరాట ఫలితంగా, దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించిన మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు మత్స్యకారులకు గొప్ప సహకారం అందించారు.
ప్రభుత్వ ప్రొసీడింగ్స్ జారీ, కుంటల కేటాయింపు
ఊట్ల మరియు దాదిగూడెం గ్రామ ప్రజల మధ్య పరస్పర అవగాహన పెరిగిన తరువాత, జిన్నారం మున్సిపల్ పరిధిలోని గ్రామాలలో చేపల పెంపకం కోసం ప్రభుత్వం 5 కుంటలను కేటాయించింది. ఈ ప్రొసీడింగ్స్ కాపీని శుక్రవారం, చిట్కుల్ లోని ఎన్ఎమ్ఆర్ క్యాంపు కార్యాలయంలో నీలం మధు గ్రామస్తులకు అందజేశారు.

ఈ నిర్ణయం మేరకు, దాదిగూడెం మత్స్యకారులు హర్షం వ్యక్తం చేసి, నీలం మధుకు ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకరబోయిన మహేష్, దాదిగూడెం అధ్యక్షులు దాది రమేష్, మత్స్యకారులు మోతె కృష్ణ, ఆంజనేయులు, కృష్ణ, భాస్కర్, మధు, నర్సింగ్ రావు, రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.








