|| దృశ్యం న్యూస్ ||
మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహకారంతో, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంతోష్ కుమార్‌తో కలిసి చేగుంట-మెదక్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి భూమి పూజ చేశారు.
దశాబ్దకాలంగా ప్రజల చిరకాల కోరికగా ఉన్న ఈ బ్రిడ్జి 100% కేంద్ర నిధులతో నిర్మించబడుతుంది.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.3,800 కోట్లతో ముత్కేడు-కర్నూలు రైల్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. చేగుంట స్టేషన్లో కొత్త ప్లాట్‌ఫాం, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ROB పనులు 18 నెలల్లో పూర్తవుతాయని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా డైవర్షన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.








