మెదక్ టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో భరోసా కేంద్ర అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ భరోసా కేంద్రం ఆధ్వర్యంలో టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ స్వేత, కౌన్సిలర్ సౌమ్య, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఫిల్లిస్ క్రిస్టల్ మెథడ్, మేపోల్ యాక్టివిటీ, బీచ్ బాల్ థెరపీ, గోల్డెన్ సర్కిల్, స్టార్ థెరపీలపై ప్రదర్శనలు నిర్వహించారు.

అదనంగా పీటీ టీచర్‌కి ఈ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు ప్రతిరోజు సాధన చేయాలనే సూచనలు చేశారు. పోక్సో చట్టం, చైల్డ్ మ్యారేజ్ చట్టం, స్వీయ రక్షణ పద్ధతులు, సోషల్ మీడియా వినియోగం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గుర్తింపు, టి-సేఫ్ యాప్, హెల్ప్‌లైన్ నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా కేస్ స్టడీస్ కూడా చూపించారు.

ఈ కార్యక్రమం యువతలో చట్టపరమైన అవగాహన, మానసిక ఆరోగ్యం, భద్రతా చర్యలపై స్పష్టత కల్పించడం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment