|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి గ్రామీణంలో కురుమ యూత్ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షుడికి ఘన సన్మానం జరిగింది. కురుమ యూత్ గణపతి వద్ద సాలువాతో సన్మానం చేసి మెమెంటో అందజేశారు.

ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షుడు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి ఎప్పుడైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను అన్నారు. పెద్ద సమస్యలు ఉంటే ఎంపీ అరవింద్ దగ్గరికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








