|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మెదక్ మండలం కొమటూరు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఆర్డీవో రమాదేవి, తాహసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం సమయంలో అధిక సంఖ్యలో విగ్రహాలు ఉన్నందున నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తూ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సౌకర్యం, రహదారి రవాణా భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, నిమజ్జన కార్యక్రమం సజావుగా సురక్షితంగా జరిగేలా చూసుకోవాలని, శానిటేషన్ విషయంపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








