|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు గురువారం మొత్తం 17 మందికి పరీక్షలు జరిపారు. వీరిలో 14 మందికి మోతే బిందు ఆపరేషన్లు అవసరమని గుర్తించి, ఒక్కరికి చిన్న ఆపరేషన్ అవసరమని తేలింది. వైద్యం అవసరం అయిన వారిని లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్‌కు తరలించారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి, ఆప్తాల్మిక్ అధికారి హరినాథ్ నెహ్రూ ఈ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మురళి, సురేష్, కృష్ణ, పద్మ, బిల్లా సంతోష్, మీన, శ్రీదేవి, నరేందర్, మల్లేష్, సుమలత, రేఖ, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.








